FbTelugu

గవర్నర్ నిర్ణయాలపై ఉత్కంఠ

విజయవాడ: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిందన్ నిర్ణయాలపై ఆంధ్రాలో ఉత్కంఠ నెలకొన్నది.
రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు అంశాలతో పాటు మాజీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామకం గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది. మూడు రాజధానులపై రాజ్యాంగపరమైన అంశాలు.. న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే గవర్నర్ మాత్రం మూడు రాజధానుల అంశంపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. న్యాయపరమైన చిక్కులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్మియామాకంపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోమవారం నాడు ఆయన రాజ భవన్ లో గవర్నర్ తో భేటీ అయ్యారు.
భేటీ అనంతరం రాజ్యంగ పరిధిలో ఉన్న అంశాలను గవర్నర్ మరోసారి పరిశీలించారు. నేడు నిమ్మగడ్డ పునర్నియామకంపై తుది నిర్ణయం తీసుకోనునే అవకాశాలు ఉన్నట్లు రాజ భవన్ వర్గాల సమాచారం.

You might also like