FbTelugu

ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య!

కృష్ణా: ఓ ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని కంచికచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఎక్సైజ్ కానిస్టేబుల్ నీలవేణి ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. నీలవేణి భర్త కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like