FbTelugu

అతిగా శానిటైజర్ల వాడకమూ ప్రమాదకరమే

న్యూఢిల్లీ: అతిగా శానిటైజర్ల వాడకం కూడా ప్రమాదకరమేనని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఆర్కే వర్మ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.
అతిగా శానిటైజర్లను వాడుతూ చేతులను శుభ్రం చేసుకోవడం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి మనిషికి మేలు చేసే మంచి బ్యాక్టీరియాలు కూడా చనిపోతున్నాయని తెలిపారు.

ఇలాంటి అసాధారణ స్వభావం ఉన్న వైరస్ ఓ మహమ్మారి రూపం దాల్చి విరుచుకుపడుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని, తరచుగా వేడినీళ్లు తాగాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. శానిటైజర్ బదులు సబ్బు, నీరు ఉపయోగించి చేతులు శుభ్రపరుచుకోవడం శ్రేయస్కరం అని తెలిపారు.

You might also like