FbTelugu

రెండు ప్రపంచ యుద్దాలను మించిపోయింది: సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: కరోనా మహమ్మారిపై జరుగుతున్న యుద్దం చరిత్రలోకి ఎక్కుతుందని, ఈ యుద్దం గతంలో జరిగిన మొదటి, రెండవ ప్రపంచ యుద్దాలను కూడా మించి పోయిందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు.

కరోనా మహమ్మారిపై ముందువరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది సేవలకు గౌరవంగా ఇవాళ వారిపై హెలీకాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడారు. కరోనా పై యుద్దంలో ప్రత్యక్షంగా 600 కోట్ల మంది ప్రజలు పోరాడుతున్నారని, రెండు వందలకు పైగా దేశాలు ఈ యుద్దం చేస్తు్న్నాయని అన్నారు.

2020 లో జరుగుతున్న ఈ యుద్దాన్ని భవిష్యత్తులో పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటారని తెలిపారు. కరోనా పై పోరాడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. ప్రజలు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని సూచించారు.

You might also like