FbTelugu

పరీక్షలు నిర్వహించి తీరుతాం: మంత్రి సురేష్

అమరావతి: ఏపీ లో టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. టన్త్, ఇంటర్మిడియట్ పరీక్షల షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

కరోనా ఉధృతి తగ్గిన తరువాత పరిస్థితి సమీక్షించి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎవరెన్ని చెప్పినా పరీక్షలు నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్రంలో పరీక్షలు వాయిదా వేయాలని టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేశ్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. పరీక్షలు నిర్వహించవద్దని పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.