FbTelugu

కొడుకును చంపిన మాజీ సైనికుడు అరెస్టు

చెన్నై: తరచూ కుమారుడు గొడవలకు దిగుతుండడంతో విసిగిపోయిన తండ్రి తన గన్ తో కాల్చిపారేశాడు. ఆ తరువాత తుపాకీతో పరారీ అయ్యాడు. పోలీసులు వెదికి అతన్ని అరెస్టు చేశారు.

పిళ్లయార్ వీధికి చెందిన మాజీ సైనికుడు సుబ్రహణి (50) కు వినోద్ (25) కుమారుడు ఉన్నాడు. తండ్రీ కొడుకుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి కూడా గొడవలు జరడంతో ఆవేశానికి గురైన తండ్రి కుమారుడిని తుపాకీతో కాల్చి చంపాడు. చుట్టుపక్కల వారు తీవ్రంగా గాయపడిన కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం తెల్లవారు జామున సుబ్రమణిని అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.