FbTelugu

మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి

హైదరాబాద్: మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (66) ఇవాళ ఉదయం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల నుంచి కిమ్స్ లో ఆయన చికిత్స పొందుతున్నారు. వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట్ లో 1954 ఆగస్టు 17న అజ్మీరా చందులాల్ జన్మించారు. శారదతో వివాహం జరగ్గా, వారికి ఒక కుమార్తె ముగ్గురు కుమారులు ఉన్నారు. 1981-1985 జగ్గన్నపేట్ సర్పంచ్ గా ఎన్నికైన చందులాల్ 1985 – 1989 లో ములుగు నియోజకవర్గం నుంచి  విజయం సాధించి నాలుగు సంవత్సరాలకే ఏపీ శాసనసభలో తెలుగుదేశం పార్టీ తరఫున 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 -1996 2వ సారి ఎమ్మెల్యేగా విజయం సాధించి, 1996 లో 11వ లోకసభ సభ్యులుగా గిరిజన ఓట్లూ అధికంగా ఉన్న వరంగల్ లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామసహాయం సురేందర్ రెడ్డి పైన ఎంపిగా టిడిపి తరఫున గెలిచారు.1998 లో మళ్లీ ఎంపిగా విజయం సాధించారు. తిరిగి 2014 లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినారు. చందూలాల్ మృతి పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.