FbTelugu

ఈఎస్ఐ లో అంతా గోల్ మాల్: ఏసీబీ

విజయవాడ: ఈఎస్ఐ లో 2014 నుండి 19 మధ్య కాలంలో మందుల కొనుగోలు విషయంలో దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ పీవీ. రవికుమార్ తెలిపారు. మందుల కొనుగోలు కోసం సుమారు రూ.970 కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు.

మందులు కొనుగోళ్ల విషయంలో రు.106 కోట్లు విలువచేసే మందులు కాంట్రాక్టు లేకుండా కొనుగోలు చేశారన్నారు. లక్షకు మించిన ఏ విధమైన కొనుగోళ్లు అయినా టెండర్ ప్రక్రియ తోనే చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ధనలక్ష్మి అనే ఉద్యోగిని ద్వారా అప్పటికపుడు బోగస్ కంపెనీ పుట్టించి మందులు కొనుగోలు చేశారని రవికుమార్ తెలిపారు.

జాయింట్ డైరెక్టర్ జనార్దన్ రూ.400 కోట్లు విలువైన మందులు అవసరంలేనివి కొనుగోళ్లు చేశారు. లోపాయకారి వ్యవహారాలు చాలా జరిగాయి అనేదానికి అచ్చెన్నాయుడు సంతకాలు చేసినట్లు గుర్తించామన్నారు.

200 రూపాయలు అయ్యే ఈసీజీ కి 480 రూపాయల ఛార్జ్ చేశారు. అన్ని రకాల అధికార దుర్వినియోగం జరిగిందని ఆయన వివరించారు. ఈ టెండర్లు లేకుండానే కొనుగోళ్లు, బిల్లులు కూడా అన్నీ ఒరిజినల్స్ కావు అన్నారు. ఇప్పట వరకు 12 మంది ముద్దాయిలు అరెస్ట్ చేసామన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉందని రవికుమార్ తెలిపారు.

You might also like