FbTelugu

అందరికీ తెలిసిపోతుందని చిన్నారిని కడతేర్చింది

బెంగుళూరు: ఓ యువతి ఇరవైరూపాయల కోసం నాలుగేళ్ల చిన్నారిని హతమార్చిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక లోని బెళగావి జిల్లాలో ఓ చిన్నారి ఇరవై రూపాయలు తీసుకొని షాపుకు వెళుతుండగా మధ్యలో ఓ

యువతి ఆ ఇరవై రూపాయలు లాక్కుంది. దీంతో ఆ బాలిక ఏడవడంతో తాను ఇరవై రూపాలయలు లాక్కున్న విషయం అదరికీ తెలిసిపోతుందని భావించింది. వెంటనే పక్కనే ఉన్న బావివద్దకు లాక్కెళ్లి బావిలో తోసేసింది. స్థానికులు గమనించి వచ్చి తీసేలోపే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like