FbTelugu

ప్రతి పనికిమాలిన వాడూ విమర్శించేవాడే: నాగబాబు

హైదరాబాద్: పవన్ కల్యాణ్ ను ప్రతి పనికిమాలిన వాడూ విమర్శించేవాడే అంటూ నాగబాబు తీవ్రంగా ఫైర్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం పట్ల నిన్న సినీ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన విమర్శలపై నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజకీయాల్లో నిర్ణయాలు అనేవి మారుతూ ఉంటాయని, ఆనిర్ణయాలు ప్రజలకు దీర్ఘకాలంలో ఉపయోగపడేలా ఉంటే మంచిదేనని అన్నారు. పవన్ కల్యాణ్ ఎవరికి ద్రోహం చేశారని ప్రకాశ్ రాజ్ విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. ఫస్ట్ ప్రకాశ్ రాజ్ మంచి మనిషిగా మారి తర్వాత విమర్శిస్తే బాగుంటుందని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.