FbTelugu

ఇవాళ కూడా 2 లక్షలు కేసులు దాటాయి

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల వేగం అమెరికా దేశం కన్నా అధికంగా ఉంది. దేశంలో కొత్తగా 2,17,353 కరోనా పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడచిన 24 గంటల్లో 1185 మరణాలు నమోదు అయ్యాయి.

ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,91,917.  ఇప్పటి వరకు మొత్తం మరణించిన వారు 1,74,308 మంది. యాక్టివ్ కేసులు 15 లక్షలకు పైగా ఉండడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో వేగంగా విస్తరించి కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్న వైరస్ ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీకి కూడా ఎగబాకింది. కేరళ, కర్ణాటక, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.