FbTelugu

సిమ్ యాక్టివేట్ అని సమ్మగా కొట్టేశారు..!

భువనేశ్వర్: కొందరు సైబర్ నేరగాళ్లు కెవైసీ అప్ డేట్ అని, ఆధార్ అప్ డేట్ అని చెప్పి డబ్బులు కొట్టేస్తున్నారు. సిమ్ యాక్టివేట్ అని చెప్పి కూడా డబ్బులు మాయం చేస్తున్నారు.
ఈ మోసాలపై పోలీసులు ఎప్పికప్పుడు అప్రమత్తం చేస్తున్నా కొందరు తెలిసీ తెలియక నష్టపోతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల వలలో పడి ఒకరు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. కటక్ వైద్యుడిగా పనిచేస్తున్న సనాతన్ మహంతి కేటుగాడి మాయలో పడి రూ.77 లక్షలు కోల్పోయాడు. ఈ నెల 9వ తేదీన మహంతికి ఒక సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. క్విక్ సపోర్టు యాప్ డౌన్ లోడ్ చేసుకుని బ్యాంకు వివరాలు ఇవ్వాలని అడిగాడు. తానే స్వయంగా యాక్టివేట్ చేస్తానని చెప్పాడు. అతడి మాటలను నమ్మిన మహంతి బ్యాంకు వివరాలు, డెబిట్ కార్డు వివరాలు అందులో షేర్ చేశాడు.

అలా చేసిన కొద్ది సమయానికే బ్యాంకు నుంచి ఏటీఎం లావాదేవీలు ఆపేసినట్లు మెసేజి వచ్చింది. దీనిపై బ్యాంకు లో మహంతి ఫిర్యాదు చేసిన తరువాత కూడా ఖాతాలో నుంచి నగదు ఖాళీ అయింది. ఫిబ్రవరి 9 నుంచి 15వ తేదీ వరకు తనకు సంబంధం లేకుండానే ఆన్ లైన్ లావాదేవీలు జరగ్గా రూ.67 లక్షలు డ్రా అయ్యాయని పోలీసులకు తెలిపాడు. అంతకు ముందే ఈ విషయంపై ఎస్.బి.ఐ బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేయగా ఏటీఎం కార్డు పనిచేయకుండా నిలిపివేశామని, కొత్త కార్డు జారీ చేస్తామని చెప్పిన తరువాత కూడా ఖాతా నుంచి డబ్బులు డ్రా అయ్యాయని డాక్టర్ మహంతి లబోదిబోమంటున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.