FbTelugu

6వ రోజు కూడా లక్ష లోపే కేసులు

న్యూఢిల్లీ: దేశంలో రాష్ట్రాలు లాక్ డౌన్ అమలుపరుస్తుండడంతో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. వరుసగా ఆరో రోజు లక్షకు దిగువన పాజిటివ్ కేసుల నమోదు అయ్యాయి.

అయితే కరోనా బాధిత మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 80,834 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,303 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే కోలుకున్నవారు 1,32,062 మంది బాధితులు ఉన్నారు. దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,94,39,989 కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. వైరస్ సోకి ఇప్పటివరకు 3,70,384 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 95.26 శాతం, మరణాల రేటు 1.26 శాతంగా ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.