FbTelugu

చిన్న పిల్లల వ్యాక్సిన్ కు పచ్చజెండా

లండన్: ప్రపంచంలో ఇప్పటి వరకు వృద్ధులు, మధ్య వయస్సు వారికి పాజిటివ్ వైరస్ సోకగా మున్ముందు చిన్నారులకు వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హెచ్చరికల నేపథ్యంలో ఫైజర్-బయో ఎన్ టెక్ సంయుక్తంగా చిన్నారుల కోసం వ్యాక్సిన్ తయారు చేశాయి. ఇటీవలే క్లినికల్ పరీక్షలు పూర్తి కావడంతో యురోపియన్ మెడిసిన్ ఏజెన్సీ కి నివేదికలు అందచేశాయి. అత్యవసర వినియోగం కింద అనుమతించాలని దరఖాస్తు చేశాయి. క్లినికల్ పరీక్షల నివేదికలు పరిశీలించిన యురోపియన్ సమాఖ్య అత్యవసర వినియోగానికి అనుమతించింది. ఫైజర్ కంపెనీ సుమారు రెండు వేల వాలంటీర్లు (12 నుంచి 15 ఏళ్ల లోపు)పై ప్రయోగ పరీక్షలు నిర్వహించింది.

ప్రస్తుతం యురోపియన్ సమాఖ్య దేశాల్లో 16 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. అయితే 12 నుంచి 15 వారికి ఇవ్వాలా వద్దా అనేది ఆ దేశాల నిర్ణయానికే వదిలేసింది. తొలుత కెనడా దేశం వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించగా ఆ తరువాత అమెరికా కూడా ఇస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.