FbTelugu

చైనా బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు మనకెందుకు? నీతి ఆయోగ్ అభ్యంతరం

ఢిల్లీ: సరిహద్దుల్లో ఇండియా సైనికుల ప్రాణాలు తీస్తున్న చైనాతో వాణిజ్య ఒప్పందాలను తెంచుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే.సారస్వత్ సూచించారు.

ఆ దేశం తయారు చేసిన బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు మనకెందుకు అంటూ ఆయన ప్రశ్నించారు. లేహ్ తో పలు సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లకు ఇచ్చేందుకు బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లను ఇండియా కొనుగోలు చేస్తున్నది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది.

ఇటీవల లద్దాఖ్ గాల్వన్ లోయలో చైనా సైనికులు ఇండియా సైనికులపై దాడికి పాల్పడి 20 మందికి పైగా హతమార్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, మరోవైపు వాణిజ్యం చేస్తున్న చైనాతో బంధం తెంచుకోవాలనే ఒత్తిడి ప్రభుత్వంపై పెరుగుతోంది.
2017 లో రెండు లక్షల బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల కోసం చైనాతో ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నది. త్వరలోనే 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇండియాకు రానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అందించే రక్షణ కిట్ల కాంట్రాక్టు విషయంలో మరోసారి ఆలోచించాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ కోరారు. ఈ మేరకు ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈయన డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) మాజీ చీఫ్ గా పనిచేశారు.

You might also like