FbTelugu

ఏడాది లోపే రోడ్ల పైకి ఇథనాల్ టూ వీలర్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ తో నడిచే వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఆ దిశగా కార్యాచరణ అమలు చేస్తున్నది. ఏడాది లోపు 94శాతం ఇథనాల్ తో నడిచే టూ వీలర్స్ ను మార్కెట్ లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన ఉత్పత్తిదారులను ఆదేశించింది.
పెట్రోల్, డీజిల్ ధరలపై దేశంలో కొన్నేళ్ల నుంచి వాహనాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించకుండా ఇంధనాలపై కేంద్ర, రాష్ట్రాలు పోటీపడి పన్నులు విధిస్తున్నాయి. పెట్రోల్ అసలు ధరతో పోల్చితే పన్నులు మూడింతలు ఉన్నాయంటే ఏ రకంగా దోపిడి చేస్తున్నారో ఊహించుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ.150 వరకు చేరుకునే ప్రమాదం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం తొలుత పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నది. ఆ దిశగా ఆటోమొబైల్ ఉత్పత్తిదారులతో దఫాదఫాలుగా సమావేశాలు నిర్వహించింది. పెట్రోల్ లో 94 శాతం ఇథనాల్ కలిపి నడిపించే టూ వీలర్స్ తయారు చేయాలని ఆదేశించింది. అదీ కూడా ఈ ఏడాదిలోపే నని స్పష్టం చేసింది కూడా. వాస్తవంగా 2023 నాటికి 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహనాలను రోడ్ల మీదికి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఏడాది ముందుగానే మార్కెట్ లోకి తేవాలని కేంద్రం ఒత్తిడి పెంచింది. ఈ విధానం మూలంగా భారత ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించడంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగనున్నది. ఇథనాల్ తో కలిపిన పెట్రోల్ తో విక్రయించే వాహన ఉత్పత్తిదారులకు, కొనుగోలుదారులకు ప్రోత్సాహక నగదు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నది.

వీటికి సమాంతరంగా ఇథనాల్ తో కూడిన పెట్రోల్ విక్రయించేందుకు చర్యలు మొదలు పెట్టింది. అదనపు ఇథనాల్ పంప్ నూజుల్స్ తో పాటు అండర్ గ్రౌండ్ ట్యాంకు, పూపులు, ఇథనాల్ డిసెన్సింగ్ యూనిట్లను బంకులలో సమకూర్చనున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇథనాల్ తో కూడిన పెట్రోల్ (10శాతం ఇథనాల్) వినియోగం 7.2 శాతం దాటింది. 2022 మార్చి నాటికి 10 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యం నిర్ధేశించుకున్నది. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ రాష్ట్రాలలో ఇథనాల్ తో కూడిన పెట్రోల్ విక్రయిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.