FbTelugu

నిత్య పెళ్లి కూతురు… మొదటి భర్తతో మోసాలు

పోలీసుల నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న మహిళ
భద్రాచలం: భర్త ఉండగానే పెళ్లి కాలేదంటూ మళ్లీ పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు గుట్టును రెండో మొగుడు విప్పాడు. తిరుపతి బాధితుడు రెండో మొగుడు కాదని మూడో మొగుడు అని తేల్చేశాడు.
ఈ నిత్య పెళ్లి కూతురు మోసాలను రెండో మొగుడు వెల్లడించాడు. కొత్తగూడెం కు చెందిన వినయ్ ఆమె వల్ల ఎంతగా నష్టపోయింది మీడియా ముందుకు వచ్చి వివరించాడు. 2018 లో సుహాసిని తనకు పరిచయం అయిందన్నారు. తాను అనాథనని, ఎవరూ లేరని చెప్పడంతో కొద్దిరోజుల పాటు ప్రేమించుకున్నామన్నారు.

2019లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని, కొద్ది రోజుల సంసారం తరువాత ఆమె ప్రవర్తన మారిందన్నారు. తనకు తెలియకుండా తన బంధువుల నుంచి లక్షల రూపాయలు అప్పులుగా తీసుకున్నదన్నారు. బంధువులు ఇచ్చిన రూ.10 లక్షలతో పాటు ఇంట్లో నుంచి రూ.5 లక్షల విలువ చేసే బంగారం తీసుకుని రెండేళ్ల క్రితం పారిపోయిందన్నారు. తనను మోసం చేసిందని, అరెస్టు చేయాలని కొత్తగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఆమె మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుని నిండా ముంచుతోందని వినయ్ ఆరోపించాడు. తిరుపతి లో తనలాగే మరో యువకుడిని మోసం చేసినట్లు పేపర్లో వార్తలు, ఫొటోలు రావడంతో మీడియా ముందుకు వచ్చి వివరాలు చెబుతున్నట్లు వినయ్ తెలిపాడు.
మొదటి భర్త వెంకటేశ్వర్లు తో కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించాడు. ఘోరమేమంటే మొదటి భర్త వెంకటేశ్వర్లు, ఇద్దరు పిల్లలను ఇంటికి పిలిచి తనకు దగ్గరి బంధువులు అని పరిచయం చేసిందన్నారు. తిరుపతిలోని అలిపిరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు సునీల్ (29) రెండో భర్త కాదని మూడో భర్త అని, ఆయనను కూడా మోసం చేసిందని అన్నాడు. విజయపురం మండలం నారపురాజు కండ్రిగకు చెందిన సునీల్ (29) సత్యానారాణపురంలో ఉంటున్నాడన్నారు. అనాధగా పరిచేయం చేసుకుని పెళ్లి చేసుకుని, ఆరు నెలల పాటు కాపురం చేసి డబ్బులతో ఉడాయించిందని వినయ్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.