FbTelugu

టిమ్స్ ను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం: ఈటల

హైదరాబాద్: అత్యంత అధునాతన సౌకర్యాలతో గచ్చిబౌలి ఆసుపత్రి సిద్ధం అయ్యింది. ప్రస్తుతం ఓపీ నడుస్తున్నదని, 4-5 రోజుల్లో ఐపీ కూడా ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
గచ్చిబౌలి లోని టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ను ఇవాళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. పీజీ కాలేజీ ఆఫ్ చండీగఢ్ ఎలా డాక్టర్లను అందిస్తుందో అదే మాదిరి టిమ్స్ పీజీ కాలేజీ కూడా భవిష్యత్తులో డాక్టర్ల ను అందించబోతుందన్నారు.

సూపర్ స్పెషాలిటీ కోర్సులకు కేరాఫ్ అడ్రస్ గా టిమ్స్ కావాలని సీఎం కేసీఆర్ ఆలోచన అని ఈటల అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలో లేనన్ని హంగులు గచ్చిబౌలి టిమ్స్ లో ఉన్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇంత అత్యాధునికమైన ఆసుపత్రి ఎక్కడా లేదన్నారు. టీమ్స్ లో 1224 బెడ్స్ సామర్ధ్యం ఉండగా 1000 బెడ్స్ కి ఆక్సిజన్, 50 బెడ్స్ కి వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 15 ఫ్లోర్లు సిద్ధం అయ్యాయి.
క్యాంటీన్ ఇక్కడే ఉంటుందని, పేషంట్లు ఇక్కడే భోజనము సిద్ధం చేస్తామన్నారు. 2 రోజుల్లో స్టాఫ్ నియామకం అయిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తక్కువ సమయంలో హెల్త్ రంగంలో అభివృద్ది సాధించామన్నారు. ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు తెచ్చామని, బురద చల్లడం మానుకోండని మంత్రి అన్నారు. గాంధీ లో వేలాది మందికి వైద్యం అందిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు.

పేదల ప్రాణాలు కాపాడుతున్న హాస్పిటల్ గాంధీ. అక్కడ పని చేస్తున్న డాక్టర్స్, సిబ్బంది మనో స్థైర్యం దెబ్బతీయవద్దని రాజేందర్ హితవు పలికారు. సోషల్ మీడియా లో చేసే కామెంట్లు పేషెంట్లకు నష్టం చేస్తాయన్నారు. కరోనా పేషెంట్లకు తోడుగా హాస్పిటల్ లో ఎవరూ ఉండరన్నారు. అన్నీ తామై మా సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వారిని అవమాన పరచడం తగదని ఈటల కోరారు. జిమ్మేదారీ లేని వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు అనేక దుస్పచారాలు చేస్తున్నారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వాటిని నమ్మకండి. కరోనా లక్షణాలు ఉన్నవారు మాత్రమే పరీక్షలు చేయించుకోండి, హాస్పిటల్ లో చేరండి. ఎంత మందికి అయిన చికిత్స చేయడానికి బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చెరవద్దని ఈటల కోరారు.

You might also like