FbTelugu

మూడు రాజధానుల ఏర్పాటు తథ్యం: గవర్నర్

అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తన బడ్జెట్ ప్రసంగంలో మూడు రాజధానుల విషయాన్ని ప్రస్తావించారు.

వర్చువల్ వీడియో ద్వారా గవర్నర్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. మూడు రాజధానులపై ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధికి మంత్రం అని అన్నారు. మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటే మా ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు.

గతంలో చెప్పిన విధంగా మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకే అని అన్నారు.

You might also like