FbTelugu

శబరిమల రైలుమార్గానికి మార్గం సుగమం

* 50 శాతం ఖర్చు భరించడానికి కేరళ అంగీకారం
శబరిమలకు రైలుమార్గం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కోట్లాదిమంది శబరిమల భక్తులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తోన్న శబరిమల రైలు మార్గం కల సాకారం కానుంది. శబరిమల రైల్వే ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 50 శాతం ఖర్చు భరించడానికి కేరళ రాష్ట్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది.

తాజా నిర్ణయంతో అయ్యప్ప భక్తులు ఇకపై నేరుగా రైలులో శబరిమల వెళ్లనున్నారు. ఇప్పటి వరకు శబరిమలకు నేరుగా రైలు మార్గం లేదు. అంగమాలి నుంచి శబరిమల వరకు 111 కి.మీ ప్రతిపాదిత ప్రాజెక్ట్​ త్వరలోనే పూర్తి కానుంది. ప్రాజెక్ట్​ అంచనా వ్యయం రూ.2,815.62 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్​ను పూర్తిచేసేందుకు 1997-98 లోనే రైల్వే బడ్జెట్​లో ప్రతిపాదించి రూ.550 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేశారు. కాగా అంగమాలి- కలాది (7 కిమీ), కలాది-పెరుంబవూర్​(10 కిమీ) పనులు మొదలు పెట్టారు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్​ మధ్యలోనే నిలిచిపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.