FbTelugu

కొత్త జిల్లాల అధ్యయన కమిటీ ఏర్పాటు

అమరావతి: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కోసం అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

కమిటీ కన్వీనర్‌గా ప్రిన్సిపల్‌ సెక్రటరీ వ్యవహరిస్తుండగా, సీసీఎల్‌ఏ, జీఏడీ సర్వీసెస్ సెక్రటరీ, ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శి సభ్యులుగా ఉండనున్నారు. రాష్ట్రంలో 25 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ఇటీవల మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మూడు నెలల వ్యవధిలో కమిటీ నివేదిక ఇవ్వాలని గడువు విధించింది.

You might also like