FbTelugu

అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై కమిటీ

అమరావతి: టీడీపీ నేత అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాన నిందితునిగా  ఆయనను ఏసీబీ అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే.

కాగా అచ్చెన్నాయుడుకి ఆపరేషన్ అయ్యిందని, ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. హాస్పిటల్ లో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ఐదుగురు వైద్యులతో ఓ కమిటీ వేసింది.

You might also like