FbTelugu

నింగినంటిన నిత్యావసరాల ధరలు

లాక్‌డౌన్‌ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నాయి. ఈ నెల 31వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో జనం ఒక్కసారిగా సోమవారం ఉదయం రోడ్లమీదకు వచ్చారు. అవసరానికి మించి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో వ్యాపారులు వాటి ధరలను అమాంతం పెంచారు. శనివారం హైదరాబాద్‌ కొత్తపేట మార్కెట్‌లో కిలోన్నర టమాటాలు పది రూపాయలకు ఇస్తే.. సోమవారం వాటి ధరను అమాంతం 50 రూపాయల దాకా అమ్మారు.

రూ.20కు కిలో పచ్చిమిర్చి ధరను వంద రూపాయల దాకా పెంచారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ధరలు శనివారం కిలో రూ.20కు అమ్మితే, సోమవారం వాటిని రూ.70కు అమ్మారు. ఇలా అన్నిరకాల కూరగాయల ధరలను పదిరెట్లు పెంచి అమ్ముతున్నారు. వాస్తవానికి నిత్యావసర వస్తువులు అమ్మే దుకాణాలే తెరవాల్సి ఉండగా అన్నిరకాల దుకాణాలు తెరుచుకున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెంచితే చర్యలు తప్పవని సీఎం కేసీఆర్‌ ప్రకటించినా వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు.

అధికారులు కూడా వాటిని పట్టించుకోవడం లేదని, రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారులే కూరగాయల ధరలను అమాంతం పెంచి బోర్డులు పెట్టారని వినియోగదారులు వాపోతున్నారు. పైగా కూరగాయల మార్కెట్లలో జనం కిటకిటలాడుతున్నారు. వారిని నియంత్రించే వారు లేకపోవడంతో కూరగాయలు కొనేందుకు జనం ఎగబడుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే కూరగాయల దుకాణాల వద్దే కరోనా వ్యాప్తి అయ్యే అవకాశం ఉందని, వీటిని నియంత్రించకుంటే ఎన్ని జనతా కర్ఫ్యూలు విధించినా, ఎన్ని లాక్‌డౌన్‌లు ప్రకటించినా ప్రయోజనం ఏముందని జనం వాపోతున్నారు.

stock market

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More