FbTelugu

ఈఎస్ఐ కుంభకోణం… 10 చోట్ల ఈడి దాడులు

హైదరాబాద్: నగరంలో ఇవాళ ఉదయం నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు ఈఎస్ఐ కుంభకోణం నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తోంది.

ఏకకాలంలో పది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లు, ఇతర వివరాలు సేకరిస్తున్నారు. మజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, ఆయన మాజీ పిఎస్ ముకుంద రెడ్డి, ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఏడుగురు నివాసాల్లో తనిఖీలు జరుపుతున్నారు. వైద్య కిట్లు, మందుల కొనుగోళ్లలో నకిలీ బిల్లలు సృష్టించి రూ.6.5 కోట్లు కుంభకోణం జరిగినట్లు ఏసిబి గుర్తించింది. ఈ కేసులో ఏసిబి దర్యాప్తు చేపట్టగా విదేశాలకు నిధులు తరలించినట్లు ఫిర్యాదులు రావడంతో ఈడి రంగ ప్రవేశం చేసింది.
ఇప్పటికే ఈ కేసులో దేవికారాణి చంచల్ గూడ జైలుకు వెళ్లి వచ్చింది. ఈ కుంభకోణంలో ఉన్న నిందితులను విదేశాలకు డబ్బులు తరలించారని, విచారణ జరపాలని ఏసిబి డైరెక్టర్ జనరల్ ఈడికి లేఖ రాశారు. లేఖ ను పరిశీలించిన ఈడి కేసు నమోదు చేసి ఇవాళ దాడులు చేపట్టింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.