FbTelugu

23 మంది కరోనా రోగుల పరారీ…

న్యూఢిల్లీ: ఇద్దరు ముగ్గురు కాదు ఏకంగా 23 మంది కరోనా పాజిటివ్ రోగులు కరోనా సెంటర్ నుంచి పరారీ అయ్యారు. 23 మంది పరారీ కావడంతో వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

బాడా హిందూరావు ఆసుపత్రిలో కరోనా బాధితులకు 250 మంచాలు కేటాయించారు. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు సుమారు 23 మంది వైద్యులకు సమాచారం ఇవ్వకుండా జారుకున్నారు. ఈ ఒక్క ఆసుపత్రిలోనే కాకుండా పలు ఆసుపత్రులలో ఇదే విధమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ మేయర్ ఆందోళన వ్యక్తం చేశారు. రోగులు ఎంత మంది ఉన్నారు, ఎవరు లేరనే విషయాన్ని ప్రతిరోజు లెక్కించుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. శనివారం నాడు ఢిల్లీలో 17,364 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 332 మంది చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.