FbTelugu

వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో పొరపాట్లు సరిచేసుకోవచ్చు

న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన తరువాత రెండు డోసులు వేసుకున్నవారికి సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి. విదేశాలకు వెళ్లేవారు ఈ సర్టిఫికెట్ చూపిస్తే తప్ప టికెట్ జారీ చేయడం లేదు.

మున్ముందు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్లేందుకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ అడిగే అవకాశాలు ఉండడంతో పలువురు వీటిపట్ల అప్రమత్తంగా ఉన్నారు. అయితే జారీ అయిన కొన్ని సర్టిఫికెట్లలో తప్పులు దొర్లుతున్నాయి. కొందరు తొందర తొందరగా వివరాలు నమోదు చేయడం లేదా తమకు తోచిన విధంగా వివరాలు ఇవ్వడంతో తప్పులు వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం ప్రజల నుంచి వస్తున్న వినతుల మేరకు సర్టిఫికెట్ లో మార్పులకు అవకాశం ఇచ్చింది. పేరు, పుట్టిన తేదీ, సెక్స్ విషయాల్లో ఏవైనా తప్పులు దొర్లితే వాటిని కోవిన్ పోర్టల్ ద్వారా సరిచేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.