FbTelugu

ఎర్రబెల్లి వర్సెస్ రెడ్యానాయక్

వరంగల్: త్వరలో మీకు మంత్రి పదవి వస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించగా… మీరు ఉండగా మళ్లీ తనకు మంత్రి పదవి ఎవరు ఇస్తారని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్.రెడ్యానాయక్ ఘాటుగా బదులిచ్చారు.
ఇవాళ డిసిసి బ్యాంక్ సహకార సంఘాల సమావేశం జరగ్గా దయాకర్, రెడ్యా నాయక్ మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది.

డోర్నకల్ నియోజకవర్గం పట్ల వివక్ష చూపిస్తున్నారని ఎమ్మెల్యే రెడ్యానాయక్ నిలదీశారు. నా నియోజకవర్గనికి సరైన నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలకు స్పందించిన దయాకర్.. మీరు మంత్రిగా ఉన్నపుడు ఏమీ చేశారు ? అని బదులిచ్చారు. నేను మంత్రి పదవి ఎవ్వరి నుంచి గుంజు కోలేదని రెడ్యా నాయక్ అన్నారు. చనిపోయిన వైఎస్.రాజశేఖర రెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. త్వరలో మీకు మంత్రి పదవి వస్తుందని దయాకర్ అనగా, మీరు ఉండగా నాకు మంత్రి పదవి రానే రాదని రెడ్యా స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.