FbTelugu

తదుపరి చిత్రం ‘మెగా ఫ్యామిలీ’: వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలకు, సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే దర్శకులు రామ్ గోపాల్ వర్మ తాజాగా.. ట్విట్టర్ వేదికగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం ‘మెగా ఫ్యామిలీ’ అంటూ అర్ధరాత్రి ఆయన ట్వీట్ చేశారు. అయితే, ‘మెగా ఫ్యామిలీ’ సినిమాను తాను తెరకెక్కించడం లేదని కాసేపటి క్రితం మరో ట్వీట్ చేశారు. ‘మెగా ఫ్యామిలీ’ అనేది 39 మంది పిల్లలు ఉన్న ఓ వ్యక్తికి సంబంధించిన చిత్రమని చెప్పారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నారని. పిల్లల సినిమాలను చిత్రీకరించడంలో తనకు అనుభవం లేదని, అందుకే ఈ సినిమాను తెరకెక్కించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More