FbTelugu

ఫంగస్ కేసులకు ఈ.ఎన్.టి నోడల్ హాస్పిటల్

హైదరాబాద్: కరోనా పాజిటివ్ చికిత్స తీసుకున్న తరువాత కొందరికి బ్లాక్ ఫంగస్ సమస్య వస్తోంది. ఈ కేసులు వెలుగుచూడ్డంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. నోడల్ కేంద్రంగా కోఠిలోని ఈ.ఎన్.టి హాస్పిటల్ ను ప్రకటించింది.

బ్లాక్ ఫంగస్ నిర్థారణ అయిన వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు రోగులు చికిత్స తీసుకుంటున్నారని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పటికే ప్రకటించారు. ఇక నుంచి ఈ రకమైన రోగులకు కోఠిలోని ఈ.ఎన్.టి హాస్పిటల్ లో చికిత్స అందించనున్నట్లు పేర్కొంది. అయితే కరోనా రోగులకు చికిత్స అందించే సమయంలో మధుమేహ స్థాయిని సరిగా అదుపు చేయాలని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలను సూచించారు. మధుమేహ స్థఆయిలను నియంత్రించేందుకు అవసరమైతేనే స్టిరాయిడ్లు వాడాలని స్పష్టం చేసింది. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో ఎక్కువగా చెవి, ముక్కు, గొంతు సమస్యలు వస్తున్నాయని తెలిపింది. కంటి సమస్య ఏమైనా ఉంటే మెహిదీపట్నంలోని సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.