FbTelugu

ఆహార భద్రతకు భరోసా ఉంది: ఆర్బీఐ

న్యూఢిల్లీ: భారత్ లో ఆహార భద్రతకు భరోసా ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. దేశంలో ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. వడ్డీరేట్లపై మరోసారి సమీక్షించి, వడ్డీ రేటు 40 బేసిక్ పాయింట్లను తగ్గించామన్నారు.

ద్రవ్యోల్బనం నేపథ్యంతో రెపోరేటు 4.4 శాతం నుంచి 4 శాతానికి తగ్గించినట్లు వివరించారు. రివర్స్ రెపోరేటును 3.2 శాతానికి తగ్గించారు. టర్మ్ రుణాల చెల్లింపుపై మారటోరియం మరో మూడు నెలలు అనగా జూన్ నుంచి ఆగస్టు వరకు అమల్లో ఉంటుందన్నారు. సీడ్బీ రుణాల మారిటోరియం కూడా మరో 90 రోజులు పొడగించారు. మరిన్ని నిధులు అందుబాటులో ఉండేందుకే రెపోరేటు తగ్గించినట్టు తెలుస్తోంది.

కరోనా వ్యాప్తి కట్టడి ఆధారంగానే ఆర్థిక కార్యకలాపాల భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆయన వివరించారు. అయితే, ఈ పరిస్థితులు వ్యవసాయ రంగానికి మాత్రం మరింత ప్రోత్సాహకంగా ఉన్నాయని దాస్ చెప్పారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గిందని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందని వివరించారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడిందని శక్తికాంతదాస్ తెలిపారు.

You might also like