FbTelugu

యూ ట్యూబ్ లో ఊపుతున్న ఎంజాయ్ ఎంజామీ

యూ ట్యూబ్ లో ఇప్పుడు ఎంజాయ్ ఎంజామీ పాట ట్రెండ్ గా మారింది. విడుదలైన రెండు నెలల్లోనే 200 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఏ తమిళ సాంగ్ సాధించని రికార్డును ఈ పాట సొంతం చేసుకోవడం గమనార్హం.
అరివు సాహిత్యం అందించిన ఈ పాటను గాయని దీక్షితా వెంకటేశన్ ఆలపించారు.

సంతోష్ నారాయణ్ నిర్మించగా అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. కోలివుడ్ కు చెందిన ప్రముఖులు ధనుష్, సిద్ధార్థ్, విఘ్నేష్ వివన్, సాయి పల్లవి, లోకేశ్ కనకరాజ్, దుల్కర్ సల్మాన్, క్రికెటర్ రవిచంద్రన్ మెచ్చుకున్నారు. గ్రామీణ ప్రాంత నుంచి అమెరికా వరకు ఉన్న తమిళులు ఈ పాటను ఆదరించారు. తమదైన స్టైల్ లో ఈ పాటకు స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసుకుంటున్నారు కుర్రకారు. కేరళ, తమిళనాడుకు చెందిన పోలీసులు కూడా ఈ పాటతోనే కరోనా వైరస్, మాస్క్ ధరించడం, భౌతిక దూరంపై అవగాహన కల్పిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.