FbTelugu

పోటీ ప్రపంచంలో పేదలకు ఇంగ్లీషు విద్య తప్పనిసరి: జగన్

అమరావతి:  నేటీ పోటీ ప్రపంచంలో పేద విద్యార్థులకు ఇంగ్లీషు విద్య ఎంతో అవసరమని ఏపీ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ విద్యారంగ సంస్కరణలపై ఆయన మేథోమథనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘‘మన పాలన- మీ సూచన’’ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిండనం వేస్ట్ అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

ఏ బడిలో చూసినా కనీస సౌకర్యలు లేవన్నారు. దీంతో ఖర్చు ఎక్కువైనా.. ప్రయివేటు బడుల్లో చేర్పిస్తున్నారని అన్నారు. ప్రయివేటు బడుల్లో ఇంగ్లీషు మీడియం ఉంటుందని, ప్రభుత్వ బడుల్లోనేమో తెలుగు మీడియం ఉంటుందన్నారు. ఈ పోటీ సమాజంలో ముఖ్యంగా పేద విద్యార్థులు రాణించాలంటే ఇంగ్లీషు విద్య రావాలని అన్నారు. మనం వాడే మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ ఇలా ఏదైనా సరే ఒపెన్ చెయ్యగానే ఇంగ్లీషులోనే సమాచారం వస్తుందని అన్నారు. ఈ ఇంగ్లీషు మీడియం వద్దూ.. అనే పెద్దలు ఏ ఒక్కరూ.. తమ పిల్లలను మాత్రం తెలుగు మీడియంలో చదివించడం లేదని అన్నారు.

You might also like