FbTelugu

 ఆక్సిజన్, వెంటిలేటర్లు పంపించిన ఇంగ్లండ్

లండన్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పలు దేశాలు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. తాజాగా ఇంగ్లండ్ కూడా ముందుకు వచ్చింది.
600కు పైగా ఆక్సిజన్‌ కాన్సెట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర మెడికల్ పరికరాలు భారత కు పంపింది. ఇంగ్లండ్‌‌లోని బకింగమ్‌షైర్ మిల్టన్ కీన్స్ నుంచి భారత్‌కు తరలించారు. ఈ పరికరాలు ఇవాళ ఢిల్లీకి చేరుకుంటాయి. మరోవైపు కరోనాపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని, తమకు మిత్రదేశమని ఇంగ్లాండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు. భారత్ తమకు మిత్రదేశమన్నారు.

స్పందించిన సింగపూర్…

సింగపూర్ దేశం కూడా 600కు పైగా ఆక్సిజన్‌ కాన్సెట్రేటర్లు, వెంటిలేటర్లు, ఇతర మెడికల్ పరికరాలను ఇండియాకు పంపింది. వీటిని చాంగి ఎయిర్‌పోర్ట్‌ లో ఎయిర్ ఇండియా విమానం ద్వారా భారత్‌కు రవాణా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.