FbTelugu

సెప్టెంబర్ 15 నుంచి ఇంజనీరింగ్ క్లాసులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఇంజనీరింగ్ విద్యార్థుల విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమవుతోంది. ఏఐసిటిఈ ఇంజినీరింగ్‌ కళాశాలలకు 2021-22 విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. సెప్టెంబరు 15 నాటికి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని కోరింది.

ఇంజనీరింగ్ లో అడ్మిషన్ల కోసం సెప్టెంబరు 10 నాటికి కౌన్సిలింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. సెప్టెంబరు 1 నాటికి ఇంజినీరింగ్‌ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కావాలని సూచించించింది.  తరగతులు ఆన్‌లైన్‌ లేదా ప్రత్యక్షంగా నిర్వహించవచ్చని వెల్లడించింది. కరోనా పరిస్థితుల ప్రకారం విద్యా సంవత్సరంలో మార్పులు చేసినట్లు ఏఐసిటిఈ వెళ్లడించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.