FbTelugu

ముగిసిన వ్యాక్సినేషన్ డ్రైరన్

కృష్ణా: జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైరన్ ముగిసింది. జిల్లాలోని మొత్తం 5 సెంటర్లలో డ్రైరన్ ముగిసినట్టుగా అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో.. రిజిస్ట్రేషన్ నుంచి వ్యాక్సినేషన్ వరకు ఒక్కొక్కరికి సుమారు 5 నిమిషాల సమయం పడుతున్నట్టుగా అధికారులు వెల్లడించారు.

అలాగే ఇవాళ కొవిన్ యాప్ లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధికారులు పరిశీలించినట్టు తెలిపారు. ఇవాళ సాయంత్రం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ అధికారులు సమావేశం నిర్వహించనున్నారు. తాజా నివేదికను రాష్ట్ర కమిటీకి జిల్లాటాస్క్ ఫోర్స్ పంపించనుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.