FbTelugu

ముగిసిన థర్డ్ ఫ్రంట్ భేటీ

న్యూఢిల్లీ: ఎన్.సి.పి అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ నివాసంలో బిజెపియేతర పార్టీల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేశంలోని ఎనిమిది పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలు, కరోనా నియంత్రణలో వైఫల్యం, నిరుద్యోగంపై ప్రధానంగా చర్చించారు. దీంతో పాటు ఇతర ముఖ్య అంశాలను కూడా చర్చించినట్లు మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా తెలిపారు. తృణముల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ, ఆమ్ ఆద్మీ, ఆర్.ఎల్.డి, వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. వీరితో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూఖ్ అబ్ధుల్లా, సంజయ్ ఝా, జనతాదళ్ యునైటెడ్ నాయకుడు పవన్ వర్మ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏపి సింగ్, ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.