FbTelugu

24 గంటలు అయినా తరలని మృతదేహాలు?

విశాఖపట్నం: కొయ్యూరు మండలం తీగలమెట్ట అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంత వరకు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను ఘటనా స్థలం నుంచి తరలించలేదని సమాచారం.

ఎదురు కాల్పుల్లో ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ, గాలికొండ ప్రాంత కార్యదర్శి జగన్ తప్పించుకున్నారన్న సమాచారంతో పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ఈస్ట్ డివిజన్ మావోయిస్టులు గాలికొండ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. తీగలమెట్ట ప్రాంతం ప్రాంతం వద్ద ఒకరికొకరు తారసపడడం, ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. పలక జీడి, వెన్నెలపాలెం, పాలసముద్రం వెళ్లకుండా వై రామారం ఎస్ఐ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది అంటూ సామాన్య ప్రజలు బిక్కు బిక్కు మంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. సుమారు 400 మంది ప్రత్యేక బలగాలు అడవి మొత్తం జల్లెడ పడుతున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని జిల్లా ఎస్పి బొడ్డెపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన వారి ఫొటోలు విడుదల చేశామని, వారిని గుర్తించిన తరువాత కుటుంబ సభ్యులు మృతదేహాల కోసం విశాఖ పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.