FbTelugu

ఎన్ కౌంటర్… ఐదుగురు మావోయిస్టులు మృతి

విశాఖపట్నం: మన్యం ప్రాంతం కొయ్యూరు మండలంలోని మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల మోతతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి రేగింది.

ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు వార్తలొస్తున్నాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం ఉండడంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మృతుల్లో తెలంగాణకు చెందిన సందెం గంగయ్య ఉన్నారు. ప్రస్తుతం డిసిఎం కమాండర్ గా కొనసాగుతున్నాడు. ఘటనా ప్రాంతానికి గ్రేహౌండ్ బలగాలను పెద్ద ఎత్తున తరలించారు. కూంబింగ్ లో ఏకె 47, ఎస్ఎల్ఆర్. మూడు కార్బన్ 303, తపంచాలను స్వాధీనం చేసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.