సిరిసిల్ల: ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడిచేయడంతో ఓ కూలీ మృతి చెంది, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన జిల్లాలోని గంభీరావు పేట మండలం, గోరంటాలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. స్థానిక గోరంటాలలో ఉపాధి హామీ కూలీలు పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో ఓవ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.