FbTelugu

పెను తుఫానుగా మారనున్న ఎంఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుఫాన్ అతితీవ్ర తుఫానుగా మారనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 12 గంటల్లో పెను తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ తుఫాన్ గంటకు 8 కిలోమీటర్ల వైగంతో పశ్చిమ బెంగాల్ వైపు దూసుకొస్తోంది. ఒడిషా పారాదీప్ కు దక్షిణంగా 820 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైనట్టు తెలిపింది. అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ గాలులు, వర్షం సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ తుఫాన్ ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

You might also like