FbTelugu

కరోనా తో ఢిల్లీ ఏయిమ్స్ డాక్టర్ మృతి

ఢిల్లీ: ఢిల్లీ ఏయిమ్స్ వైద్యులు, ఛాతి వ్యాధుల నిపుణులు డాక్టర్‌ జితేంద్రనాథ్ పాండే కరోన వైరస్‌తో మృతి చెందారు.

ఏయిమ్స్ లో చికిత్స తీసుకుంటూ పాండే (78) తుది శ్వాస విడిచారు. ఏయిమ్స్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన ఇప్పటి వరకు ఢిల్లీలోని సీతారామ్ భార్తియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చి లో ప్రతి రోజు 50 మంది కి పైగా రోగులను పరీక్షించారు.

ఉత్తర భారత దేశంలో ఇంటెన్సీవ్ కేర్ యూనిట్ల (ఐసీయూ) ఏర్పాటులో కీలక భూమిక పోషించడమే కాకుండా పలువురు వైద్యులకు శిక్షణనిచ్చారు. ఏయిమ్స్‌లో మెడిసన్‌ విభాగానికి ఆయన హెడ్‌గా కూడా పనిచేశారు. ఢిల్లీలో ఊపిరితిత్తులకు సంబంధించి ఏ అంశమైనా డాక్టర్‌ జేఎన్‌ పాండేదే తుది మాట. డీజిల్ బస్సుల నిషేధంపై పాండే నాయకత్వంలో ఒక కమిటీని 1997 లో సుప్రీంకోర్టు నియమించింది.

 

You might also like