FbTelugu

‘ఏలూరు’ ఘటనలో విస్తుపోయే నిజాలు

పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏలూరు వింత వ్యాధి ఘటనపై జరిపిన పరిశోధనలో సంచలన నిజాలు బయటికొస్తున్నాయి. ప్రజలు అకస్మాత్తుగా మూర్చకు గురి కావడం పట్ల కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటి నమూనాల్ని అధికారులు సేకరించి ప్రయోగశాలలో పరిశీలించారు. నీటిలో అనేక వేల రెట్లు అధికంగా హానికరమైన రసాయనాలు, క్రిమిసంహారకాల అవశేషాలు ఉన్నట్టుగా గుర్తించారు.

వాటిలో కలుపు మొక్కల నివారణకు వాడే మందులు, దోమలు, ఈగలు, బొద్దింకలతో పాటు, పంటల్ని ఆశ్రయించే చీడపీడల్ని నివారించేందుకు ఫర్టిలైజర్ అవశేషాలున్నట్టుగా గుర్తించారు. లీటరు నీటిలో 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువ మోతాదులో ఉండాల్సిన మెథాక్సీక్లోర్‌ 17.64 మిల్లీ గ్రాముల ఉన్నట్టుగా గుర్తించారు. ఇది సాధారణం కంటే 17,640 రెట్లు ఎక్కువ.

You might also like

Leave A Reply

Your email address will not be published.