హైదరాబాద్: రూ.426 కోట్లతో ఇందిరా పార్క్, రామకృష్ణ మఠం వద్ద నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ కు ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముషీరాబాద్, అంబార్ పేట నియోజకవర్గ ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజు రెండు ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశామని అందులో ఒకటి ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు, రెండవది రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లి వరకు ఫ్లైఓవర్ నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.