FbTelugu

యువకుడికి తొక్కి చంపిన ఏనుగు

చిత్తూరు: పలమనేరు మండలం కాలవపల్లి గ్రామం నందు నిన్న రాత్రి ఒంటరిగా వెళ్లిన యువకుడిని ఏనుగు పంట పొలాల్లో తొక్కి చంపింది. ఈ ఘటలనలో జానకి రామ్ (27) అనే వ్యక్తి చనిపోయాడు.

వివరాల్లోకి వెళితే అర్ధరాత్రి సమయంలో మోటర్ వేయడానికి వెళ్లిన జానకి రామ్ కి ఏనుగు తారస పడడంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా అతని పై ఏనుగు దాడి చెయ్యడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి పేరు త్యాగరాజు కాగా కాలవపల్లి చెక్ పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.