FbTelugu

సీతంపేటలో ఏనుగుల బీభత్సం

శ్రీకాకుళం: జిల్లాలోని సీతంపేట మన్యంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఒండ్రుజోల, సంతవలస మధ్య ఏనుగుల గుంపు తీష్ట వేసినట్టుగా గుర్తించారు. దీంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఏనుగుల గుంపు తిష్ట వేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పంధించి ఏనుగులను అక్కడినుంచి తోలాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు.

You might also like