తిరువతనంతపురం: అనుకోకుండా ఒక ఏనుగు బావిలో పడింది. ఎప్పుడు పడిందో తెలియదు కాని దాని అరుపులు విన్న కొందరు చూసి అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటన కోజికోడ్ జిల్లాలో అనకంపాయిల్ గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామంలో 50 అడుగుల లోతులో ఉన్న బావిలో ఏనుగును చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించగా రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. బావి గట్టును తవ్వి దాన్ని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఏనుగును బయటకు తీసిన తరువాత పూర్తిగా పరీక్షించి అటవీ ప్రాంతంలోకి వదిలేస్తామని అధికారులు తెలిపారు.