FbTelugu

ఎన్నికల కోడ్ అమలు చేయాలి: ఎస్ఈసీ

అమరావతి: రాష్ట్రములో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. గ్రామా సచివాలయ సిబ్బందిని దూరంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పలు ప్రాంతాల్లో వున్న హోర్డింగ్స్ తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.
విగ్రహాలు కనిపించకుండా గుడ్డలు కప్పాలని సూచించారు.

గ్రామ వార్డు సచివాలయలల్లో ఉన్న సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చిత్రపటాలు, విడుదలైన రైస్ కార్డు, ఫించన్ కార్డు, ఇతర సర్టిఫికెట్ల పై నవరత్నాలు గుర్తులు వుంటే వాటిని తొలగించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఎన్నికల కమిషన్ ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.