FbTelugu

మోగిన ఎన్నికల నగరా

ఈ ఎన్నికలకు ఆన్ లైన్ నామినేషన్లు

డోర్ టూ డోర్ ప్రచారానికి ఐదుగురికే అనుమతి

రోడ్డు షో లో ఐదు వాహనాలకే పరిమితి

80 ఏళ్లు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్ సోకర్యం

మే 2వ తేదీన ఫలితాలు, అమల్లోకి వచ్చిన కోడ్

న్యూఢిల్లీ: దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) షెడ్యూలు ప్రకటించింది. 5 రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 రాష్ట్రాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం తో పాటు పుదుచ్చేరి లో ఎన్నికలు నిర్వహిస్తునట్లు కేంద్ర ఎన్నిక కమిషన్ ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా తెలిపారు. ఎన్నికల సిబ్బందిని ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించామని, వాక్సినేషన్ చేయించుకున్న వారినే ఎన్నికల సిబ్బందిగా నియమిస్తామని ఆయన ప్రకటించారు. డోర్ టూ డోర్ ప్రచారం లో అభ్యర్థితో పాటు మరో నలుగురు మాత్రమే ప్రచారం చేయాలన్నారు. పశ్చిమ బెంగాల్ – 294. తమిళనాడు – 234 సీట్లు,కేరళ – 140, అస్సాం – 126 సీట్లు, పుదుచ్చేరి – 30 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. రోడ్డు షో లో కూడా ఐదు వాహనాలకు మించి అనుమతించడం లేదని, సమస్మాత్మక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగాను మోహరిస్తున్నామన్నారు. 80 సంవత్సరాలు దాటిన వారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చన్నారు.

మొత్తం 18.68 కోట్ల ఓటర్లు 2.7 లక్షల పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆయన వివరించారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. పలు దశల్లో ఎన్నికలు జరుగుతాయని అరోరా వెల్లడించారు. మే 2వ తేదీన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం ఫలితాలు ప్రకటిస్తామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.