FbTelugu

శాశ్వత పరిష్కారం కోసమే హైకోర్టులో కేసు: మహాలక్ష్మమ్మ

అమరావతి: కడప జిల్లా కందిమళ్లాయపల్లె శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి ఎంపిక పై శాశ్వత పరిష్కారం కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు దివంగత పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మమ్మ తెలిపారు.
నా భర్త వ్రాసిన వీలునామా చెల్లుతుందా? మా కుటుంబ సభ్యుల మధ్య రాసుకున్న ఒప్పందం చెల్లుతుందా? దేవాదాయ శాఖ ద్వారా నా బిడ్డలకు న్యాయం జరిపించాలని మాత్రమే హైకోర్టును ఆశ్రయించనట్లు ఆమె వివరించారు. భవిష్యత్తులో మఠాధిపతి కోసం తగువులు జరగకుండా న్యాయస్థానం తీర్పు పొందాలని ఉద్దేశంతో తో శాశ్వత పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పింది. బ్రహ్మంగారి భక్తులు గ్రామస్తులు సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మైదుకూరు వైసిపి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నాకు అన్న లాంటివారు, అనేక విధాలుగా మాకు సహకారం అందించారని కొనియాడారు. హైకోర్టు లో వేసిన కేసులో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేరు చేర్చినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని మహాలక్ష్మమ్మ ఖండించారు.

ఇరువురు భార్యలతో చర్చించే నిర్ణయం…
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో దాదాపు 5 రోజులు సందిగ్దత కొనసాగిందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి తెలిపారు. ఏపి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజలు మధ్య వారి కుటుంబం తో చర్చలు జరిపిన మాట వాస్తవమేనన్నారు. పీఠాధిపతి ఎన్నిక విషయంలో ఇరు కుటుంబాలు పరస్పర అంగీకారం తో మొదటి భార్య పెద్ద కుమారుడిని పీఠాధిపతి గా నిర్ణయించామన్నారు. ఇరువురు భార్యల సంతానం మధ్య ఏకాభిప్రాయం రావడానికి అందరం కృషి చేసామన్నారు. దివంగత పీఠాధిపతి రెండవ భార్య మహాలక్ష్మమ్మ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసిందన్నారు. న్యాయస్థానం ఇచ్చే ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే రఘురామి రెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.