FbTelugu

18న మేయర్లు, చైర్మన్ల ఎన్నిక: ఎస్ఈసీ

విజయవాడ: రాష్ట్రంలో పోలింగ్ జరిగిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక 18న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిర్ణయించింది.

ఏలూరు మున్సిపల్ కార్పేషన్ మినహా ఎన్నికలు జరిగిన 11 నగర పాలక సంస్థలు, 75 మున్సిపాల్టీల్లో పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులతో తొలుత ప్రమాణ స్వీకారం చేయించి ఆ తరువాత మిగతా ప్రక్రియ చేపట్టనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఎక్స్‌ అఫిషియో హోదాలో ఓటు హక్కు కల్పించారు. గుర్తింపు కలిగిన పార్టీలకు విప్‌ జారీచేసే అధికారం ఉంది. కాగా కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనకు విప్ జారీ చేసే అవకాశం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.